Kitabı oku: «డయాబెటిక్ డైట్: డయాబెటిస్ కోసం పరిపూర్ణమైన వంటపుస్తకం», sayfa 2
రుచికరమైన ఆలోచన #1: టాంగీ క్యాబేజీ ట్రీట్
తినేవారి సంఖ్య : 4
వండడానికి పట్టే సమయం : 33 నుండి 37 నిమిషాలు
కేలరీలు: 253
కొవ్వులు: 22.8 గ్రా
ప్రోటీన్లు: 7.9 గ్రా
పిండి పదార్థాలు: 4.7 గ్రా
మీకు కావలసిన పదార్థాలు :
జలపెనో మిరియాలు (రెండు, తరిగినవి)
క్యాబేజీ (ఒకటి)
మిరియాలు & ఉప్పు (తగినంత)
ఉల్లిపాయ (ఒకటి, తరిగినది)
బేకన్ (ఆరు, ముక్కలు)
తయారు చేయు విధానం :
1 మొదట, ప్యాక్‌పైవున్న ఆదేశాల ప్రకారం బేకన్ ఉడికించాలి. మీరు బేకన్ను తగినవిధంగా ఉడికిస్తూ, అదే సమయంలో క్యాబేజీని మరియు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా తరిగి సిద్ధం చేయండి.
2 బేకన్ ను మీరు కోరినట్లుగా సిద్ధం చేసిన తర్వాత, దానిని పాన్ నుండి తీసి ఉల్లిపాయ మరియు క్యాబేజీని దానికి కలపండి. బేకన్ నుండి వచ్చిన కొవ్వుతో పాటు అన్నింటిని బాగా కలిపి తక్కువ మంటపై దయచేసి ఉడికించండి.
3 తరువాత, మీకు నచ్చినంత చిన్న ముక్కలుగా జలపెనో మిరియాలను తరిగి సిద్ధం చేసుకోండి. వీటిని మిగిలిన పదార్థాలతో పాటు వేయడానికి సంకోచించకండి
4 కూరగాయలు ఉడికిన తరువాత, ఉడికిన పెళుసైన బేకన్ ముక్కల్ని తీసుకొని మొత్తం మిశ్రమంపై జల్లండి. తక్కువ కార్బ్ లేదా తక్కువ చక్కెర వున్న మసాలా దినుసులతో పాటు మిరియాలు & ఉప్పు జోడించండి.
5 చివరగా, మొత్తం మిశ్రమాన్ని అటూ ఇటూ సమానంగా కలిపి సర్దిపెట్టండి. వడ్డించండి మరియు ఆనందించండి!
రుచికరమైన ఆలోచన #2: తక్కువ కార్బ్ గల గుడ్డు & వెజ్జీ బైట్స్
ఎంతమందికి వడ్డించవచ్చు: 6
వండడానికి పట్టే సమయం: 11 నుండి 14 నిమిషాలు
కేలరీలు: 21.8
కొవ్వులు: 3.7 గ్రా
ప్రోటీన్లు: 4.3 గ్రా
పిండి పదార్థాలు: 1.8 గ్రా
మీకు కావలసిన పదార్థాలు:
బెల్ మిరియాలు (75 గ్రా, తరిగినవి)
దోసకాయ (45 గ్రా, తరిగినవి)
పాలకూర (స్పినాచ్) (225 గ్రా, తరిగినది)
టొమాటో (75 గ్రా, తరిగినది)
గుడ్లు (మూడు)
ఉప్పు (ఇష్టపడే విధంగా)
తయారు చేయు విధానం:
1 ప్రారంభించడానికి, మఫిన్ ట్రేతో పాటు 180 డిగ్రీల సెల్సియస్‌కు ఓవెన్‌ను ఏర్పాటు చేయండి. మీరు ఇష్టపడితే చిన్న భాగాలుగా పెట్టడానికి చిన్న ట్రేలు అయితే మంచిది.
2 తరువాత, మిక్సింగ్ కంటైనర్ ఉపయోగించండి మరియు దాని లోపల గుడ్లు (పెంకు తీసి) వేయండి. అవి పూర్తిగా కలిసే వరకు చురుగ్గా కొట్టండి.
3 ఇప్పుడు, కొవ్వు రాసిన ట్రేలు మీకు నచ్చినవి వాడండి (ఉదాహరణకు, నాన్-స్టిక్ స్ప్రే చేసినవి). దయచేసి కూరగాయల (తరిగినవి) కోసం కొంచెం కొవ్వును అదనంగా ఉండేలా నిర్ధారించుకోండి
4 ఆ తర్వాత, ట్రేలోపల గిలక్కొట్టిన గుడ్లు వేసి, మీకు కావలసిన రీతిలో తరిగిన కూరగాయలు వేసి కలపండి. ఈ మిశ్రమం ట్రేలోపల అన్నీ వైపులా సమానంగా పంపిణీ అయ్యేలా సర్దండి. ఆ తర్వాత, సుమారు 11 నుండి 14 నిమిషాలు వేడిలో ఓవెన్‌లో ఉంచండి.
5 చివరగా, మిశ్రమం అన్ని వైపులా పూర్తిగా ఉడికేలా నిర్ధారించుకోండి. దీన్ని అల్పాహార ట్రీట్ లేదా రుచికరమైన చిరుతిండిగా సర్వ్ చేయండి.
రుచికరమైన ఆలోచన #3: రుచికరమైన చికెన్ డీ-లైట్
ఎంతమందికి వడ్డించవచ్చు: 2
వండడానికి పట్టే సమయం: 35 నుండి 40 నిమిషాలు
కేలరీలు: 794.7
కొవ్వులు: 39.1 గ్రా
ప్రోటీన్లు: 44.2 గ్రా
పిండి పదార్థాలు: 3.3 గ్రా
మీకు కావలసిన పదార్థాలు:
రోజ్మేరీ ఆకులు (10 గ్రా)
మిరియాలు & ఉప్పు (తగినంత)
వెల్లుల్లి (రెమ్మలు, ఆరు, ముక్కలు)
చికెన్ ఛాతిభాగం (455 గ్రా బోన్లెస్ & స్కిన్లెస్)
చెద్దర్ చీజ్ (70 గ్రా, తురిమినది)
బటర్ (55 గ్రా)
తయారు చేయు విధానం:
1 మొదటిగా, మీ ఓవెన్ ను సుమారు 190 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతకు సెట్ చేయండి. ఓవన్ ఉష్ణోగ్రత పెరిగేలోపు, కొవ్వును (మీ ఇష్టమైనది) రాసి ఒక ట్రేని సిద్ధం చేయండి.
2 తరువాత, మీకు నచ్చినట్టుగా చికెన్ కు మసాలా జోడించండి.
3 ఆ తర్వాత, వెల్లుల్లి బటర్ సిద్ధంచేయడం ప్రారంభించండి. పాన్ లేదా స్కిల్లెట్ తీసుకోండి మరియు రేంజ్ ప్రకారం మీడియం వేడికి సెట్ చేయండి. వెన్న బాగా కరిగిన తర్వాత, వెల్లుల్లిలో కలిపి సుమారు ఐదు నుండి ఆరు నిమిషాలు ఉడికించండి. ఈ సమయం గడచిన తర్వాత, వెల్లుల్లి గోధుమ రంగులోకి రావాలి, కానీ అది మాడిపోకుండా చూసుకోండి. ఇప్పుడు, ఈ బటర్ & వెల్లుల్లి మిశ్రమాన్ని చికెన్ పైన కవర్ చేయండి.
4 ఈ మిశ్రమాన్ని సిద్ధం చేసిన తర్వాత, ఓవెన్‌లో సుమారు ఒక అర్థగంట పాటు ఉంచండి. చికెన్ పూర్తిగా అన్ని వైపులా బాగా ఉడికే విధంగా దాన్ని అప్పుడప్పుడు చెక్ చేయండి. ఇలా ఉడికిన తర్వాత, దానిపైన చీజ్ టాపింగ్ గా జోడించండి. అది కరిగే వరకు వేచివుండండి.
5 పైన మరికొంత బటర్ & వెల్లుల్లి మిశ్రమాన్ని జోడించి సర్వ్ చేయండి. ఆనందించండి!
రుచికరమైన ఆలోచన #4: తక్కువ కార్బ్ గల ఫ్రైడ్ చికెన్ సర్ప్రైజ్
ఎంతమందికి వడ్డించవచ్చు: 6
వండడానికి పట్టే సమయం: 33 నిమిషాలు
కేలరీలు: 768
కొవ్వులు: 54.1 గ్రా
ప్రోటీన్లు: 59.2 గ్రా
పిండి పదార్థాలు: 1.9 గ్రా
మీకు కావలసిన పదార్థాలు:
పోర్క్ (రిండ్స్, 85 గ్రా)
మిరియాలు & ఉప్పు (ఇష్టపడినంత)
లార్డ్ (కావలసినంత)
గుడ్డు (ఒకటి)
చికెన్ (తొడభాగాలు, ఆరు)
తయారు చేయు విధానం:
1 మొదటిగా, ఐరన్ పాన్ లేదా స్కిల్లెట్‌ను టాప్ రేంజ్ లో వేడిచేయండి. ఆ తర్వాత, గుడ్లను మిక్సింగ్ కంటైనర్లో వేసి గిలకొట్టండి.
2 ఆ తరువాత, నలగగొట్టడం ద్వారా రిండ్స్ ను సిద్ధం చేయండి. అది పూర్తయిన తర్వాత, చికెన్ ముక్కలకు గుడ్డుసొనను అద్దించండి (మీరు బ్రష్ లేదా డిప్ ఉపయోగించవచ్చు) మరియు ఉప్పు & మిరియాలతో మీకు నచ్చినట్టుగా సీజన్ చేయండి.
3 ఇప్పుడు, అలా సిద్ధం చేసిన చికెన్ ముక్కలను తీసుకొని, పోర్కు రిండ్స్ పొడిలో అద్దించండి. ప్రతి చికెన్ ముక్కనూ ఇలాగే చేయండి.
4 తరువాత, పాన్ లేదా స్కిల్లెట్‌లో అర అంగుళాల పందికొవ్వు (లేదా వంట నూనె) జోడించండి. అది మరిగే వరకు వేచి ఉండండి. ఆ తర్వాత, చికెన్ ముక్కలను అగ్నిలో ఉంచండి. ప్రతి వైపు నాలుగు నుండి ఆరు నిమిషాలు కాల్చండి. దయచేసి వాటిని అన్నీ వైపులా ఉడికేలా నిర్ధారించుకోండి.
5 దయచేసి సరిగ్గా ఉడికే విధంగా కనీసం రెండుసార్లు చికెన్ ను అటూ ఇటూ తిప్పండి. మంచిగా క్రిస్పీ వెజ్జీలు లేదా వెజ్జీ చిప్స్ తో సర్వ్ చేయండి.
రుచికరమైన ఆలోచన #5: తక్కువ చక్కెరగల బీఫ్ ఎక్స్ప్లోజన్
ఎంతమందికి వడ్డించవచ్చు: 4
వండడానికి పట్టే సమయం: ఒక గంట
కేలరీలు: 331
కొవ్వులు: 26.7 గ్రా
ప్రోటీన్లు: 18.7 గ్రా
పిండి పదార్థాలు: 2.1 గ్రా
మీకు కావలసిన పదార్థాలు:
వెల్లుల్లి ( రెమ్మలు, రెండు, తరిగినవి)
తురిమిన కొబ్బరి (55 గ్రా)
ఉల్లిపాయలు (పచ్చివి, మూడు)
కొబ్బరి నూనె ( 45 గ్రా)
అల్లం (10 గ్రా, తురిమినది)
స్టీక్ (పల్చని ఐరన్ స్టీక్, 455 గ్రా)
తయారు చేయు విధానం:
1 మొదట, పొడవైన, సన్నని ముక్కలుగా కట్ చేయడం ద్వారా స్టీక్‌ను సిద్ధం చేసుకోండి. పూర్తయిన తర్వాత, పెద్ద ఫ్రీజర్ బ్యాగ్‌లో ఉంచండి, తద్వారా మీరు అల్లం, కొబ్బరి తురుము మరియు వెల్లుల్లిని జోడించవచ్చు. అప్పుడు, ఫ్రీడ్జ్ లో ఉంచండి, ఆవిధంగా దీన్ని ఒక గంట సమయం వరకు మేరినేట్ చేయండి.
2 ఆ తర్వాత, వేడి చేయడానికి పాన్ లేదా స్కిల్లెట్ ఉంచండి. మాంసానికి నూనె జోడించండి. ఉడికే వరకు మూడు నుండి నాలుగు నిమిషాలు వేడి చేయండి. అప్పుడు, దాన్ని స్టీక్లో కలిపి టాస్ చేసి, పూర్తిగా ఉడికినంత వరకు వేచిఉండండి. దీనికి ఐదు నుండి ఏడు నిమిషాలు పడుతుంది.
3 తరువాత, రుచికి కిక్ ఇవ్వడానికి ఉల్లిపాయలు (ఆకుపచ్చ) జోడించండి. మీకు నచ్చిన ఆకృతి వచ్చేవరకు దానంతటిని ఒకటి లేదా రెండు నిమిషాలు అలాగే ఉంచండి.
4 చివరగా, ఫ్రీజర్ బ్యాగ్ నుండి కొంత మేరినేడ్ తీసుకొని మంటను ఆపడానికి కొంచెం ముందు కలిపి దించేయండి. ఇది అదనపు కిక్‌ని అందిస్తుంది. గుమ్మడికాయ పాస్తా లేదా తక్కువ కార్బ్ కౌస్కాస్ మీదవేసి సర్వ్ చేయండి.
రుచికరమైన ఆలోచన #6: బ్రహ్మాండమైన టాంగీ పోర్క్
ఎంతమందికి వడ్డించవచ్చు: 4
వండడానికి పట్టే సమయం: 34 నుండి 37 నిమిషాలు
కేలరీలు: 466.1
కొవ్వులు: 32.3 గ్రా
ప్రోటీన్లు: 47.2 గ్రా
పిండి పదార్థాలు: 2.7 గ్రా
మీకు కావలసిన పదార్థాలు:
స్టాక్ (చికెన్, 55 గ్రా)
మిరియాలు (7.5 గ్రా)
పోర్క్ (చాప్స్, నాలుగు)
పాలు (202 గ్రా)
కొత్తిమీర (9 గ్రా)
థైమ్ ఆకులు (ఎండినది, 14.5 గ్రా)
వెల్లుల్లి (రెమ్మలు, రెండు, తరిగినవి)
బటర్ (47 గ్రా)
ఉప్పు (14.5 గ్రా)
ఓరెగానో (ఎండినది, 14.5 గ్రా)
తయారు చేయు విధానం:
1 మొదటిగా, బేకింగ్ షీట్లో ఉంచడం ద్వారా చాప్స్ సిద్ధం చేసుకోండి. మిరియాలు & ఉప్పు చల్లి సీజన్ చేసుకోండి. కచ్చితంగా రుచినివ్వడానికి మసాలాను సమానంగా చక్కగా కలపండి. అలా ఒక గంటపాటు అలాగే ఉంచండి. ఆ సమయం గడిచిన తర్వాత, చాప్స్ లోని అదనపు ద్రవం లేకుండా జాగ్రత్తగా శుభ్రం చేయండి.
2 తరువాత, పాన్ రేంజ్ టాప్ లో అధిక వేడికి సెట్ చేయండి. వెల్లుల్లి & బటర్ వేసి తిప్పండి. వెల్లుల్లి పూర్తిగా మంచిరంగులోకి మారిన తర్వాత, పైన చాప్స్ వేయాల్సిన సమయం వచ్చింది.
3 చాప్స్ వేసిన తర్వాత, రెండు వైపులా వాటిని సుమారు నాలుగు నుండి ఆరు నిమిషాలు ఉడికించాలి. అప్పుడు, మరొక నిమిషం సిమ్మర్ లో ఉంచండి, లేదా రుచి రావడానికి అలా ఉంచండి. తర్వాత తీసి, ప్రక్కన పెట్టండి
4 అప్పుడు, తక్కువ మంట మీద, స్టాక్ (చికెన్) వేయండి, అలాగే కొంచెం పాలు వేయండి. చాప్స్ నుండి మిగిలిపోయిన చిన్నచిన్న ముక్కలను గీకి తీయండి. పూర్తయిన తర్వాత, ఒరేగానో, కొత్తిమీర మరియు థైమ్ వేసి కలపి టాసు చేయండి. దయచేసి మీరు సాస్ ను సిమ్మర్ లోనే ఉంచి, ఉడకబెట్టకుండా వుండేలా నిర్ధారించుకోండి
5 చివరగా, సాస్ చిక్కగా అయిన తర్వాత, మంటను ఆపివేసి, చాప్స్ ను తిరిగి స్కిల్లెట్ లోకి మార్చండి. అలా అన్నింటిని కలపండి మరియు కావాలనుకుంటే ఎక్కువ మిరియాలు & ఉప్పు చేర్చండి. వెజ్జీస్ లేదా ఫ్రెష్ సలాడ్ తో సర్వ్ చేయండి.
రుచికరమైన ఆలోచన #7: ఫైలెట్ & చీజ్ సుప్రీం
ఎంతమందికి వడ్డించవచ్చు: 3 లేదా 4
వండడానికి పట్టే సమయం: 31 నుండి 36 నిమిషాలు
కేలరీలు: 211
కొవ్వులు: 17.4 గ్రా
ప్రోటీన్లు: 11.9 గ్రా
పిండి పదార్థాలు: 2.25 గ్రా
మీకు కావలసిన పదార్థాలు:
పప్రికా మిర్చి (4.5 గ్రా)
చేప ముక్క (225 గ్రా)
పార్స్లీ (రేకులు, 7.5 గ్రా)
మిరియాలు (నల్లవి, 4.5 గ్రా)
నూనె (ఆలివ్, 18.5 గ్రా)
చీజ్ (పర్మేసన్, 45 గ్రా)
తయారు చేయు విధానం:
1 మొదటిగా, ఓవన్ ను సుమారు 180 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేయండి
2 ఇప్పుడు, మిరియాలు (నలుపు), పప్రికా మిరపకాయ, చీజ్ (పర్మేసన్) మరియు పార్స్లీ కోసం మిక్సింగ్ కంటైనర్ దగ్గర పెట్టుకోండి.
3 ఆ తర్వాత, మసాలా మిశ్రమంతో చేప ఫైలెట్లను వేసి కవర్ చేయండి. నూనె (ఆలివ్) వేసి, ఆపై మిశ్రమం జాగ్రత్తగా సమానంగా వాటికి పట్టేలా కలపండి.
4 చేపలు రెడీ అయిన తర్వాత, ఫైలెట్లను ట్రే పైన అమర్చండి మరియు సుమారు పద్నాలుగు నుండి పదిహేడు నిమిషాలు ఓవెన్లో ఉంచండి
5 చివరగా, ఒకటికి రెండుసార్లు చెక్ చేసి చేపలను పూర్తిగా ఉడికించి, పైన ఒక పొరలా ఏర్పడేలా చీజ్ వేయండి. చీజ్ మంచిగా పెళుసైనంత వరకు కొన్ని క్షణాలు అలాగే ఉంచండి, తర్వాత తీసివేసి, సర్వ్ చేయండి. వెజ్జీస్ లేదా తక్కువ కార్బ్ వున్న బ్రౌన్ రైస్‌తో ఆనందించండి.
రుచికరమైన ఆలోచన #8: త్వరగా సులభంగా చేసే తక్కువ కార్బ్ గల చిప్స్
ఎంతమందికి వడ్డించవచ్చు: 4
వండడానికి పట్టే సమయం: 28 నుండి 34 నిమిషాలు
కేలరీలు: 91.7
కొవ్వులు: 8.1 గ్రా
ప్రోటీన్లు: 3.2 గ్రా
పిండి పదార్థాలు: 2.8 గ్రా
మీకు కావలసిన పదార్థాలు:
ఉప్పు (ఇష్టపడినంత)
మిరియాలు (ఇష్టపడినంత)
బేకన్ (స్లైసెస్, ఎనిమిది)
నూనె (ఆలివ్, 18.5 గ్రా)
తయారు చేయు విధానం:
1 మొదటిగా, సుమారు 180 డిగ్రీల సెల్సియస్ వరకు ఓవెన్ ను సెట్ చేయండి
2 తరువాత, నూనె (ఆలివ్) తో ట్రేని గ్రీజు చేయండి లేదా మీకు నచ్చిన నూనె ఏదైనా పర్వాలేదు. అప్పుడు, బేకన్‌ను చిన్నగా, కొరికేటంత-పరిమాణంలో వున్న ముక్కలుగా విడదీయండి
3 తరువాత, మీ రుచికి తగినట్లు మిరియాలు & ఉప్పుతో సీజన్ చేయండి.
4 ఆ తర్వాత, సుమారు పద్దెనిమిది నుండి ఇరవై ఒక్క నిమిషాలు ఓవెన్లో పెట్టండి. బయటకు తీసి చల్లబరచండి.
5 పట్టుకొనేటంత చల్లగా అయిన తర్వాత, బిట్స్ తీసుకొని మీడియం ఫైర్ మీద స్కిల్లెట్ లేదా పాన్ లో ఉంచండి. ఈ ప్రక్రియ సాధారణంగా నాలుగు నుండి ఆరు నిమిషాలు పడుతుంది. మంట మీద నుండి తీసివేసి చిప్స్‌గా వడ్డించండి. మీరు తక్కువ కొవ్వు, తక్కువ కార్బ్ డిప్‌తో కలిపి ఆకలిపుట్టించే వంటకం వలె వడ్డించండి!
రుచికరమైన ఆలోచన #9: నమ్మశక్యంగాని తక్కువ కార్బ్ వున్న సౌత్ ట్రీట్
ఎంతమందికి వడ్డించవచ్చు: 3 నుండి 4
వండడానికి పట్టే సమయం: 29 నుండి 32 నిమిషాలు
కేలరీలు: 288
కొవ్వులు: 22.3 గ్రా
ప్రోటీన్లు: 18.9 గ్రా
పిండి పదార్థాలు: 2.7 గ్రా
మీకు కావలసిన పదార్థాలు:
టర్కీకోడి చాతిభాగం (రోస్టు చేసింది, 225 గ్రా, చాప్ చేసింది)
చీజ్ (పర్మేసన్, 75 గ్రా)
చెద్దర్ చీజ్ (తురిమినది, 225 గ్రా)
తెల్లని చెద్దర్ చీజ్ (తురిమినది, 225 గ్రా)
మీకు కావలసిన పదార్థాలు:
1 మొదటిగా, సుమారు 180 డిగ్రీల సెల్సియస్ వరకు ఓవెన్ ను సెట్ చేయండి.
2 తరువాత, మిక్సింగ్ కంటైనర్ తీసుకొని అన్ని చీజ్లను కలపండి. మీరే దాన్ని కలపొచ్చు లేదా ఎలక్ట్రిక్ మిక్సర్‌ను ఉపయోగించవచ్చు. అప్పుడు, ఒక చెంచా మిక్స్ తీసుకొని బేకింగ్ షీట్ మీద ఒక ముద్దలా ఉంచండి. మీరు కుకీల పిండిని అమర్చినట్లుగా అమర్చండి. ఒక్కొక్క ముద్దకు మధ్య ఒక అంగుళం దూరం ఉండేలా పెట్టండి.
3 షీట్ నింపిన తరువాత, సుమారు ఏడు నుండి ఎనిమిది నిమిషాలు ఓవన్ లో వుంచండి. దయచేసి చిప్స్ మాడిపోకుండా చూసుకోండి. అంచులు బంగారు గోధుమ రంగులోకి మారినప్పుడు చిప్స్ బాగా ఉడుకుతాయి. అప్పుడు, వాటిని బయటకు తీసి, చల్లబరచండి.
4 చివరగా, టర్కీకోడి చాటిభాగాన్ని తీసి కట్ చేయండి మరియు తక్కువ-చక్కెర వున్న డిప్ తో చిప్స్ సర్వ్ చేయండి. దీన్ని ఒక స్నేక్ లాగా లేదా ఎంట్రీగా అంటే భోజనానికి ముందు మొదటి వంటకం వలె వడ్డించండి.
రుచికరమైన ఆలోచన #10: తక్కువ చక్కెరగల ఇటాలియన్ స్నాక్ ఆప్సన్
ఎంతమందికి వడ్డించవచ్చు: 4 నుండి 6
వండడానికి పట్టే సమయం: దాదాపు 22 నిమిషాలు
కేలరీలు: 226
కొవ్వులు: 23.7 గ్రా
ప్రోటీన్లు: 18.4 గ్రా
పిండి పదార్థాలు: 5.7 గ్రా
మీకు కావలసిన పదార్థాలు:
మోజారెల్లా చీజ్ (తురిమినది, 225 గ్రా)
మిరియాలు: (ఇష్టపడినంత)
మసాలా (ఇటాలియన్, 14.5 గ్రా)
పెప్పరోని (115 గ్రా, తరిగినది)
వెల్లుల్లి (పొడి, 8.5 గ్రా)
ఉప్పు (ఇష్టపడినంత)
అధనంగా చేసుకొనే ఎంపిక: డిప్పింగ్ కొరకు మరినారా సాస్
తయారు చేయు విధానం:
1 మొదటిగా, సుమారు 180 డిగ్రీల సెల్సియస్ వరకు ఓవెన్ ను సెట్ చేయండి.
2 తరువాత, చిన్న మఫిన్ ట్రే తీసుకొని స్ప్రే (కుకింగ్) తో స్ప్రే చేయండి. దాన్ని ఒక ప్రక్క పెట్టండి.
3 అప్పుడు, మిక్సింగ్ కంటైనర్లో, మిరియాలు & చీజ్, వెల్లుల్లి (పొడి), ఉప్పు మరియు మసాలా (ఇటాలియన్) కలపండి. చీజ్ బాగా కలపి, దానికి మసాలా జోడించండి. ఒక చెంచానిండుగా మిశ్రమాన్ని తీసుకుంటూ ట్రేలో మఫీన్ పెట్టడానికున్న ప్రతి స్థలంలో ఆ మిశ్రమాన్ని ఉంచండి.
4 తరువాత, ప్రతి మఫీన్ పైన పెప్పరోని వేయండి. అలా సిద్ధం చేసిన తర్వాత, ఎనిమిది నుండి పది నిమిషాలు ఓవెన్లో ఉంచండి. ఈ సమయం గడిచాక, చీజ్ అన్ని వైపులా కరిగి, వాటిచుట్టూ లేత గోధుమ రంగులోకి వస్తుంది.
5 చివరగా, వాటిని బయటకు తీసి, చల్లబరచండి మరియు తక్కువ-చక్కెర వున్న సాస్‌తో వడ్డించండి (మరినారా సాస్ చాలా రుచిగా ఉంటుంది). స్నాక్ లాగా వడ్డించండి లేదా మాంసంతో పాటు వడ్డించండి.
4 వ అధ్యాయం: గౌర్మెట్ రెసిపీ ఆలోచనలు
నోరూరించే ఆలోచన #1: రుచికరమైన చికెన్ మరియు వెజ్జీ పాట్
ఎంతమందికి వడ్డించవచ్చు: 4 నుండి 6
వండడానికి పట్టే సమయం: 26 నుండి 32 నిమిషాలు
కేలరీలు: 238
కొవ్వులు: 10.9 గ్రా
ప్రోటీన్లు: 27.6 గ్రా
పిండి పదార్థాలు: 2.7 గ్రా
మీకు కావలసిన పదార్థాలు:
బ్రోకలీ (ఒక బ్యాగ్, ఫ్రోజెన్)
చికెన్ (115 గ్రా, తురిమినది)
వెల్లుల్లి పొడి (ఇష్టపడినంత)
సూప్ (మష్రూమ్ క్రీం, ఒక కేన్)
మిరియాలు (ఇష్టపడినంత)
చీజ్ (చెద్దర్ 221 గ్రా)
తయారు చేయు విధానం:
1 మొదటిగా, సుమారు 185 డిగ్రీల సెల్సియస్ వరకు ఓవెన్ ను సెట్ చేయండి.
2 అప్పుడు, మిక్సింగ్ కంటైనర్లో, మీరు ఉపయోగించే పదార్థాలన్నిటిని కలిపి టాస్ చేయండి (చికెన్, చీజ్ మరియు సుగంధ ద్రవ్యాలు)
3 తర్వాత, వాటిని సూప్ తో కలపండి.
4 తరువాత, మిశ్రమాన్ని బేకింగ్ కంటైనర్లో ఉంచి ఓవెన్లో పెట్టండి.
5 ఆ తర్వాత, ఓవెన్ లో దాదాపు ఇరవై ఐదు నుండి ముప్పై నిమిషాల పాటు ఉడకనివ్వండి.
6 చివరగా, సూప్ బాగా ఉడికి, చీజ్ సరిగ్గా కరిగేలా చూసుకోండి. క్రిస్పీ వెజ్జీస్ తో లేదా బాదం బ్రెడ్‌స్టిక్‌లతో పాటు వడ్డించండి.
నోరూరించే ఆలోచన #2: రుచికరమైన తక్కువ చక్కెరున్న చికెన్ భోజనం
ఎంతమందికి వడ్డించవచ్చు: 4
వండడానికి పట్టే సమయం: దాదాపు 30 నిమిషాలు
కేలరీలు: 384
కొవ్వులు: 21.1 గ్రా
ప్రోటీన్లు: 48.1 గ్రా
పిండి పదార్థాలు: 3.2 గ్రా
మీకు కావలసిన పదార్థాలు:
క్రీం (పుల్లనిది, 221 గ్రా)
ఉప్పు (9.5 గ్రా)
చికెన్ (ఛాతి భాగం, 1 కిలో, బోన్ లేకుండా)
వెల్లుల్లి (పొడి, 14.5 గ్రా)
మిరియాలు (4.5 గ్రా)
చీజ్ (పర్మేసన్, 165 గ్రా, తురిమినది)
తయారు చేయు విధానం:
1 మొదటిగా, సుమారు 185 డిగ్రీల సెల్సియస్ వరకు ఓవెన్ ను సెట్ చేయండి.
2 తరువాత, గ్రీజుతో బేకింగ్ కంటైనర్ను సిద్ధం చేయండి (లేదా మీకు నచ్చిన స్ప్రే ఎంచుకోండి)
3 తరువాత, మిక్సింగ్ ట్రేలో, పుల్లని క్రీం మరియు ఒక కప్పు చీజ్ (పర్మేసన్) జోడించండి.
4 అప్పుడు, ప్రతి ముక్క పైన మిశ్రమాన్ని అద్ది, చికెన్ (ఛాతి భాగం) ను ట్రేలో ఉంచండి. అలాగే, మిగిలిపోయిన చీజ్ తో పైన పల్చగా కప్పండి.
5 ఆ తరువాత, ట్రేని ఓవెన్లో పెట్టండి. సుమారు ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది నిమిషాలు అలాగే ఉంచండి.
6 చివరగా, పూర్తిగా ఉడికిన తర్వాత తీసివేసి, మీకు ఇష్టమైన తక్కువ కార్బ్ వున్న ఆహారంతో పాటు వడ్డించండి.
నోరూరించే ఆలోచన #3: ఇటాలియన్ చికెన్ డిన్నర్ డిలైట్
ఎంతమందికి వడ్డించవచ్చు: 3 నుండి 4
వండడానికి పట్టే సమయం: దాదాపు 25 నిమిషాలు
కేలరీలు: 581
కొవ్వులు: 41.1 గ్రా
ప్రోటీన్లు: 48.2 గ్రా
పిండి పదార్థాలు: 6.1 గ్రా
మీకు కావలసిన పదార్థాలు:
వెల్లులి (రేఖలు, రెండు, ముక్కలుచేసినవి)
టొమాటోలు (ఎండబెట్టినవి, 65 గ్రా)
స్పినాచ్ (221 గ్రా, తరిగినవి)
చికెన్ (ఛాతీ భాగం, నాలుగు)
పప్రికా మిరపకాయ (8.5 గ్రా)
క్రీం (చిక్కనిది, 221 గ్రా)
వెల్లుల్లి (పొడి, 8.5 గ్రా)
బటర్ (14.5 గ్రా)
ఉప్పు (8.5 గ్రా)
తయారు చేయు విధానం:
1 మొదటిగా, వెల్లుల్లి (పొడి), మిరపకాయ మరియు ఉప్పును మిక్సింగ్ కంటైనర్లో కలపండి. పూర్తయిన తర్వాత, చికెన్‌ను పల్చగా కోట్ చేయడానికి ఈ మిశ్రమాన్ని ఉపయోగించండి
2 తరువాత, ఒక స్కిల్లెట్ లేదా పాన్ ని వేడి చేయండి మరియు దాని మధ్యలో రెండు చెంచాల వెన్న వేయండి. వెన్నను కరగనివ్వండి. దీని తరువాత, బాగా మసాలా పట్టించిన చికెన్ వేసి బాగా ఉడికించాలి. ప్రతి వైపు ఉడకడానికి ఐదు నిమిషాలు పడుతుంది. దయచేసి చికెన్ అన్ని ప్రక్కలా బాగా ఉడికేటట్టు చూడండి. దాన్ని తీసివేసి ఒక ప్రక్క ఉంచండి.
3 అప్పుడు, మిగిలిన పదార్థాలన్నీ జోడించండి: టమోటాలు, క్రీమ్ మరియు టమోటాలు. మిక్స్ చిక్కగా అవ్వడానికి తక్కువ మంట మీద మూడు నిమిషాలు పడుతుంది. తరువాత, స్పినాచ్ కలిపి టాసు చేసి, మరో నాలుగు నిమిషాలు కలపండి.
4 చివరగా, తీసిన చికెన్‌ను మరలా ఈ మిశ్రమంలో వేయండి, తద్వారా అన్ని రుచులు కలిసిపోతాయి. చికెన్ ను సరిగ్గా ఉడికించండి, అవసరమైతే మసాలా మరింత వేసుకోండి. వెజ్జీస్, గుమ్మడికాయ పాస్తా లేదా తక్కువ కార్బ్ కౌస్కాస్ తోపాటు సర్వ్ చేయండి.
నోరూరించే ఆలోచన #4: రుచికరమైన నిమ్మకాయ బీఫ్ సర్ప్రైజ్
ఎంతమందికి వడ్డించవచ్చు: 4
వండడానికి పట్టే సమయం: దాదాపు మూడు గంటలు
కేలరీలు: 507
కొవ్వులు: 35.1 గ్రా
ప్రోటీన్లు: 44.8 గ్రా
పిండి పదార్థాలు: 3.1 గ్రా
మీకు కావలసిన పదార్థాలు:
మిరియాలు (4.5 గ్రా)
నిమ్మకాయ (ఒకటి)
వెల్లుల్లి (రేఖలు, నాలుగు, చిదిపినవి)
ఉప్పు (4.5 గ్రా)
బీఫ్ (ఒక కేజీ, క్యూబ్ లాంటి ముక్కలు)
పార్స్లీ (26 గ్రా, తురిమినది)
తయారు చేయు విధానం:
1 మొదటిగా, ఓవెన్ ను సుమారు 167 డిగ్రీల సెల్సియస్ వరకు వేడిలో ఉంచండి.
2 అప్పుడు, ఫాయిల్ లైనింగ్తో బేకింగ్ కంటైనర్ను సిద్ధం చేయండి.
3 తరువాత, మిక్సింగ్ కంటైనర్ తీసుకొని, రసం (నిమ్మ), కొంత రుచి (నిమ్మ), ఉప్పు మరియు వెల్లుల్లితో బీఫ్ మాంసం (క్యూబ్డ్) ను నచ్చినట్టుగా కలపండి. రుచిగా సిద్ధం చేసిన తర్వాత, ఫాయిల్ పేపర్ చుట్టి చిన్న చిన్న ప్యాక్ లుగా చేయండి.
4 అప్పుడు, ప్యాకేజీ సిద్ధమైన తర్వాత, ఓవెన్లో మధ్య భాగంలో వుంచి, సుమారు మూడు గంటలు అలాగే ఉంచండి. మాంసం ఉత్తమమైన రుచిని పొందడానికి, మృధువుగా ఉడకడానికి ఇలా సుదీర్ఘ సమయం పడుతుంది.
5 చివరగా, ప్యాకేజీని బయటకు తీసివేసి, ఐదు లేదా ఆరు నిమిషాలు అలాగే వుంచండి. మాంసానికి ఎక్కువ రసం (నిమ్మకాయ) కలిపి, పార్స్లీని పైన చళ్ళండి. మీకు ఇష్టమైన తక్కువ కార్బ్ వున్న ఆహారంతో పాటు సర్వ్ చేయండి.
––––––––
నోరూరించే ఆలోచన #5: గౌర్మెట్ (నోరూరించే) సిర్లోయిన్ ఆప్సన్
ఎంతమందికి వడ్డించవచ్చు: 3 నుండి 4
వండడానికి పట్టే సమయం: 25 నుండి 30 నిమిషాలు
కేలరీలు: 389
కొవ్వులు: 18.9 గ్రా
ప్రోటీన్లు: 47.1 గ్రా
పిండి పదార్థాలు: 2.3 గ్రా
మీకు కావలసిన పదార్థాలు:
వెల్లుల్లి (రెమ్మలు, నాలుగు, చిదిపినవి)
నూనె (ఆలివ్, 12 గ్రా)
మిరియాలు & ఉప్పు (ఇష్టపడినంత)
స్టీక్ (సిర్లోయిన్, 945 గ్రా, క్యూబ్ లాంటి ముక్కలు)
బటర్ (14.5 గ్రా)
తయారు చేయు విధానం:
1 మొదటిగా, ఒక ఇనుప స్కిల్లెట్ లేదా పాన్ తీసుకొని అధిక వేడి మీద ఉంచండి మరియు నూనె (ఆలివ్) వేయండి.
2 తరువాత, మీ ఇష్ట ప్రకారం స్టీక్‌లో మిరియాలు & ఉప్పు కలపండి.
3 మీ ఇష్ట ప్రకారం స్టీక్ కు మసాలా చేర్చిన తర్వాత, వేడి నూనెతో కలిపి వేడి స్కిల్లెట్ లేదా పాన్లో ఉంచండి. వేడి నూనెలో స్టీక్ ను ప్రతి వైపు నాలుగు నిమిషాలు వేగించండి. రెండుసార్లు తిరగేయండి. ఆ తర్వాత బయటకు తీయండి.
తరువాత, అదే స్కిల్లెట్ లేదా పాన్ ఉపయోగించి, బటర్ మరియు వెల్లుల్లిలో టాసు చేయండి. దయచేసి తిప్పుతూ వుండండి, అలా అడుగంటుకోకుండా చూసుకోండి.
1 వెల్లుల్లి లేత లేదా బంగారు గోధుమ రంగులో ఉన్నప్పుడు. ప్రతి వైపు మరో రెండు నిమిషాలు మాంసాన్ని వేగించండి. రుచిగా తయారయ్యే వరకు మంటను సిమ్మర్ లో ఉంచండి. మీకు ఇష్టమైన ఆహారంతో వడ్డించండి.
Ücretsiz ön izlemeyi tamamladınız.