Kitabı oku: «ముఖ మొటిమల చికిత్స»

Yazı tipi:

విషయ సూచిక

 ముఖ మొటిమల చికిత్సఓవెన్ జోన్స్ఓవెన్ జోన్స్విషయ సూచికముఖ మొటిమల మచ్చ చికిత్సమొటిమలకు మూలికా నివారణలుకౌమారదశలో మొటిమలుమీ మొటిమలకు చికిత్స చేయడానికి విశ్రాంతి తీసుకోండిమొటిమల పొక్కులకు చికిత్సమొటిమలను ఎదుర్కోవడం మరియు వాటితో ఎలా వ్యవహరించాలిమొటిమలకు ఇంట్లో చికిత్సమొటిమలకు సహజ నివారణలుమొటిమల చర్మ చికిత్సగర్భధారణ సమయంలో మొటిమలకు చికిత్సమొటిమలకు ఇంటివద్దే నివారణసాలిసిలిక్ యాసిడ్ తో మొటిమలకు చికిత్సలుగర్భ నిరోధక మాత్రలు మొటిమలకు నివారణగా పనిచేస్తాయా?మొటిమల చికిత్స కోసం చిట్కాలుటీనేజ్ అమ్మాయిలు మరియు మొటిమలు

1 ముఖ మొటిమల చికిత్స

రచయిత

1 ఓవెన్ జోన్స్

మేగాన్ పబ్లిషింగ్ సర్వీసెస్ ప్రచురించింది

http://meganthemisconception.com

కాపీరైట్ ఓవెన్ జోన్స్ 2021 ©

హలో, ‘మొటిమల చికిత్స’ అనే నా పుస్తకాన్ని కొనుగోలు చేసినందుకు మీకు ధన్యవాదాలు.

ఈ సమాచారం మీకు సహాయకరంగా, ఉపయోగకరంగా మరియు లాభదాయకంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను.

మొటిమలు మరియు దాని సంబంధిత విషయాలపై వున్న ఈ ఈబుక్‌లోని సమాచారం ఒక్కొక్కటి 500-600 పదాలతో మొత్తం 15 అధ్యాయాలుగా సంస్థీకరించబడింది.

అదనపు బోనస్‌గా, మీ స్వంత వెబ్‌సైట్‌లో లేదా మీ స్వంత బ్లాగులు మరియు వార్తాలేఖల్లో ఈ కంటెంట్‌ను ఉపయోగించడానికి నేను మీకు అనుమతి ఇస్తున్నాను, అయినప్పటికీ మీరు వాటిని మీ స్వంత మాటలలో తిరిగి వ్రాస్తే మంచిది.

మీరు ఈ పుస్తకాన్ని విభజించి, కథనాలను PLR గా తిరిగి అమ్మవచ్చు. వాస్తవానికి, ఈ పుస్తకాన్ని ఉన్నది ఉన్నట్టుగా తిరిగి అమ్మడం లేదా ఇవ్వడం మీకు లేని ఏకైక హక్కు.

మీకు ఏదైనా అభిప్రాయం ఉంటే, దయచేసి మీరు ఈ పుస్తకాన్ని కొనుగోలు చేసిన సంస్థకు తెలియజేయండి.

ఈ ప్రచురణను కొనుగోలు చేసినందుకు మళ్ళీ ధన్యవాదాలు,

ఇట్లు,

1 ఓవెన్ జోన్స్

1  విషయ సూచిక

ముఖ మొటిమల మచ్చ చికిత్స

మొటిమలకు మూలికా నివారణలు

కౌమారదశలో మొటిమలు

మీ మొటిమలకు చికిత్స చేయడానికి విశ్రాంతి తీసుకోండి

మొటిమల పొక్కులకు చికిత్స

మొటిమలను ఎదుర్కోవడం మరియు వాటితో ఎలా వ్యవహరించాలి

మొటిమలకు ఇంట్లో చికిత్స

మొటిమలకు సహజ నివారణలు

మొటిమల చర్మ చికిత్స

గర్భధారణ సమయంలో మొటిమలకు చికిత్స

మొటిమలకు ఇంటివద్దే నివారణ

సాలిసిలిక్ యాసిడ్ తో మొటిమలకు చికిత్సలు

గర్భ నిరోధక మాత్రలు మొటిమలకు నివారణగా పనిచేస్తాయా?

మొటిమల చికిత్స కోసం చిట్కాలు

టీనేజ్ అమ్మాయిలు మరియు మొటిమలు

1  ముఖ మొటిమల మచ్చ చికిత్స

ముఖ మొటిమల మచ్చలు అనేవి గతంలో హటాత్తుగా అవి మీకు ఏర్పడడాన్ని లేదా గతంలో మొటిమల మూలంగా అనుభవించిన తీవ్రమైన పరిస్థితిని ఇది మీకు గుర్తుచేస్తుండవచ్చు. అవి శాశ్వతమన్నట్టుగా కనిపించడం మరియు అవి అసహజంగా వుండడం వల్ల వాటిని భరించడం కష్టం. సాధారణంగా, ముఖ మొటిమల మచ్చ చికిత్స చాలా కష్టం, కానీ కణజాల పునరుత్పత్తి మరియు చర్మాన్ని సరిచేసి చికిత్సలో ప్రస్తుతం జరిగిన అన్ని రకాల పురోగతి దృష్ట్యా అది అసాధ్యమైతే కాదు. ముఖ మొటిమల మచ్చ చికిత్సను కాస్మెటిక్ సర్జరీ ద్వారా మరియు కొన్నిసార్లు, మనకు నేరుగా అందుబాటులో వున్న ఉత్పత్తులతో కూడా సాధించవచ్చు.

మామూలుగా చెప్పాలంటే, మొటిమల వల్ల మచ్చలున్న చర్మ కణజాలం గురించి ప్రస్తావించేటప్పుడు, ముఖంలోని జిడ్డు మూలంగా, ముఖంపైన రంద్రాలు మూసుకుపోవడం వల్ల ఏర్పడిన మచ్చల గురించి మేము మాట్లాడుతున్నాము. దృఢమైన కణజాలం చాలా మట్టుకు తాత్కాలికమైనది మరియు కాలక్రమేణా సహజంగా అదృశ్యమవుతుంది, మొటిమల తీవ్రతను బట్టి కొన్ని మచ్చలు శాశ్వతంగా ఉంటాయి, అలాంటప్పుడు మీరు ముఖ మొటిమల మచ్చల చికిత్సలను ఆశ్రయించాలనుకుంటారు.

చర్మానికి ఏర్పడిన నష్టం ప్రారంభ దశలో ఉన్నప్పుడే, ముఖ్యంగా చర్మం ఉపరితలంపై ఎర్రటి స్పోటకములతో బొడిపెలు లేదా పొక్కులు ఉంటే బాధితుడు చర్మవ్యాధి నిపుణుడిని సందర్శిస్తే తీవ్రమైన మచ్చలు నివారించవచ్చు. మొటిమల వల్ల ఇప్పటికే మీ చర్మంపై మచ్చలు ఏర్పడితే, మీరు సమస్యను మరొక కోణం నుండి చూడాల్సి ఉంటుంది, దీనిలో సాధరణంగా సున్నితమైన లోతైన చర్మ సౌందర్య శస్త్రచికిత్స ఇమిడి ఉంటుంది.

దెబ్బతిన్న చర్మ ప్రాంతాలను తొలగించి, క్రింద ఉన్న చర్మ కణజాలం యొక్క సేంద్రీయ పునఃవృద్ధిని ఉత్తేజపరిచే ఒక మార్గం లేజర్ రీసర్ఫేషింగ్. మచ్చల్ని చికిత్స చేసే ఈ విధానంలో చికిత్స చేసే భాగంలో అనస్తీషియా ఇవ్వాల్సి ఉంటుంది మరియు ఏర్పడిన గాయాన్ని బట్టి కొన్ని నిమిషాలు మరియు గంట మధ్య వ్యవధి చికిత్సకు పడుతుంది.

ముఖ మచ్చలను తొలగించే ఇటీవలి పద్ధతుల్లో ఫ్రాక్షనల్ లేజర్ థెరపీ ఒకటి. మచ్చలు చర్మంపై లోతుగా వుంటే శస్త్రచికిత్స అవసరమౌతుంది. సున్నితమైన చర్మం ఉన్న ప్రాంతాలపై మచ్చల కణజాలం యొక్క ఈ చికిత్స, నాణ్యత పరంగా డెర్మాబ్రేషన్ మరియు లేజర్ రీసర్ఫేసింగ్ కంటే మెరుగైనది మరియు వైద్య వ్యవధి చాలా తక్కువ ఉంటుంది. ఏదేమైనా, ఫ్రాక్షనల్ లేజర్ చికిత్స చాలా తక్కువ మండి అదృష్టవంతులకు మాత్రమే అందుబాటులో ఉంది, వారు దానిని భరించగలరు, ఎందుకంటే ఇది ఇప్పటివరకు అందుబాటులో ఉన్న మొటిమల మచ్చలకు ఇచ్చే చికిత్సలలో అత్యంత ఖరీదైన చికిత్స.

ముఖం మచ్చల యొక్క లోతైన స్థాయి చికిత్సను ప్రారంభించడానికి ముందు, ఎరుపు లేదా గోధుమ రంగు మచ్చలు ఉంటే, చర్మం పైపొరల పరిస్థితిని మెరుగుపర్చడానికి అనేక ముఖ మచ్చ చికిత్స సెషన్లు అవసరం కావచ్చు. సాధారణ చర్మ స్థాయిని పెంచడానికి డాక్టర్ కొల్లజెన్ ను మచ్చల్లోకి ఇంజెక్ట్ చేయవచ్చు లేదా అతను / ఆమె దానికి మైక్రో డెర్మాబ్రేషన్ను సూచించవచ్చు.

ఇంట్లోనే మచ్చల చికిత్స కోసం రసాయనాలతో ఉపరితల కణజాలాన్ని తొలగించడానికి ప్రయత్నించడం పరిస్థితిని తీవ్రతరం చేసే ప్రమాదం వుంది కాబట్టి అది చెడ్డ ఆలోచన. మీరు మచ్చలను మరింత అధ్వాన్నంగా కనబడేలా చేస్తారు.

మొటిమల మచ్చల రకాలను బట్టి, అవి కనిపించే తీరును బట్టి వాటిని వర్గీకరించవచ్చు మరియు ముఖ మొటిమల మచ్చ చికిత్స తదనుగుణంగా మారుతుంది. కణజాలం పెరగడం వల్ల లేదా కణజాలం కోల్పోవడం వల్ల మచ్చలు వస్తాయి, కానీ అవి రెండూ ముఖం కనిపించే తీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. మొటిమల మచ్చ చికిత్సకు సంబంధించి దేన్ని ఎంపిక చేసుకోవాలి అనేది నిర్ణయించుకోడానికి ముందు మచ్చల స్వభావాన్ని ప్రత్యేకమైన నిపుణులు మూల్యాంకనం చేయడం చాలా ప్రాముఖ్యం.

1 మొటిమలకు మూలికా నివారణలు

మొటిమల సమస్య ఏమిటంటే, దాన్ని ఆపడానికి మీరు పెద్దగా ఏమీ చేయలేరు, ఎందుకంటే చాలా తరచుగా ఇది మీరు పెద్దయ్యాక మీ శరీరంలోని హార్మోన్ల మార్పులకు జరిగే ప్రతిచర్య. ఇలా చెప్పిన తరువాత కూడా, మీకు ఈ లక్షణాల తీవ్రతను తగ్గించడానికి మార్గాలు ఉన్నాయి. ఈ పుస్తకంలోని ఇతర భాగాలలో మీకు చాలా సూచనలు దొరుకుతాయి, కాని ఇక్కడ మొటిమలకు మూలికా నివారణల గురించి నేను చర్చించాలనుకుంటున్నాను.

చాలా మంది ప్రజలు తాజా రసాయన చికిత్సలను కొనడానికి మరియు వాటి కోసం చాలా డబ్బు ఖర్చు చేయడానికి ఫార్మసీకి వెళతారు, కాని నిజంగా, వారు ఆరోగ్య దుకాణానికి లేదా కూరగాయలమ్మే వాళ్ళదగ్గరికి వెళ్లాలి ఎందుకంటే మొటిమలకు మూలికా నివారణలు పుష్కలంగా ఉన్నాయి, దానితోపాటు నయంచేసే మందులు తాజా పండ్లు మరియు కూరగాయల నుండి తయారు చేస్తారు.

మొదటిగా, మొటిమలు అంటే ఏమిటో మీరు అర్థం చేసుకోవాలి: ఇది సెబమ్ ఆయిల్ నాళాలు పూడిపోయి, తరువాత అవి బ్యాక్టీరియా బారిన పడతాయి. కాబట్టి, మొటిమలు రాకుండా మీరు ఆపలేనప్పుడు, మీరు అదనంగా చేరిన నూనెను తీసివేసి, మీ చర్మంపై బ్యాక్టీరియా ఎక్కువ కాలం జీవించకుండా చేయగలగాలి.

మొదట మీరు ఆరోగ్యకరమైన తాజా పండ్లు మరియు కూరగాయలను తినడం ద్వారా మీ శరీరాన్ని లోపలి నుండి శుభ్రపరచడానికి ప్రయత్నించాలి మరియు మీ జీవితంలో దీనికోసం కొవ్వులు మరియు నూనెలు అలాగే వాటిని కలిగి ఉన్న ఏదైనా తినడం తగ్గించాలి. ఈ నూనెలను శరీరం నుండి బయటకు తీసే ప్రయత్నంలో మీరు పుష్కలంగా నీరు త్రాగాలి. గ్రీన్ టీ కూడా తాగితే మంచిది.

టీ ట్రీ ఆయిల్ మరియు లావెండర్ ఆయిల్ సహజంగా క్రిమినాశక మందులు మరియు అవి నూనెలే అయినప్పటికీ ప్రభావిత ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు. అవి వేర్వేరు గాఢతలలో దొరుకుతాయి మరియు పీచుపండు నూనె వంటి తటస్థ నూనెలతో వాటిని పల్చగా చేయాల్సి ఉంటుంది, కాబట్టి మీరు వాటిని కొన్నప్పుడు ఆరోగ్య దుకాణంలో సలహా అడగండి. పురిపిడి కాయలకు కూడా వీటిని ఉపయోగించవచ్చు.

కలబంద అనేది ఒక మొక్క, దీన్ని ప్రభావిత ప్రాంతంపై నేరుగా మీకు నచ్చినంత తరచుగా రుద్దవచ్చు. ఇది చాలా చల్లగా హాయిగా అనిపించేలా చేస్తుంది. మందపాటి ఆకును త్రుంచి, దాని పైనున్న చర్మం కొంచెం తొలగించి, లోపల ఉన్న జెల్లీని మీ చర్మంపై రుద్దండి. మీరు తాజా కలబందను ఒక్కసారి ఉపయోగించారంటే, తర్వాత ఎప్పుడూ షాపులో కొన్న కలబందను ఉపయోగించాలని మీరు ఆశపడరు.

నిమ్మరసం ఒక క్రిమినాశకి మరియు చాలా హాయినిస్తుంది. ఒక నిమ్మకాయ నుండి రసం పిండి, ఆ రసాన్ని మెత్తని బట్టపై పోసి, ఆ బట్టతో మీ ముఖాన్ని తుడవాలి. నిమ్మరసం మొటిమల బ్యాక్టీరియాను చంపడమే కాదు, అదనపు నూనెను కూడా తొలగిస్తుంది. సాధారణ వెనిగర్ కూడా ఇలాగే పనిచేస్తుంది.

హైడ్రోజన్ పెరాక్సైడ్ మరియు విచ్ హాజెల్ రెండూ కూడా మలినాలను శుభ్రపర్చే పదార్థాలే, దుకాణంలో కొన్న నివారణ మందుల కంటే చౌకైనవి మరియు మంచివి. మళ్ళీ, ఈ వస్తువుల గాఢతలను (సాంద్రతలను) బట్టి వీటితో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వాటిని, ముఖ్యంగా పెరాక్సైడ్ ను బహుశా పల్చగా చేయాల్సి రావచ్చు.

మొటిమలకు ఇంకా అనేక గృహ నివారణోపాయాలు ఉన్నాయి, వీటిలో చాలా వరకు ఖరీదైన రసాయనాల మాదిరిగానే పనిచేస్తాయి, సమస్య నిజంగా ఏమిటో గుర్తుంచుకోండి (నూనె మరియు బ్యాక్టీరియా) మరియు వాటికి చికిత్స చేసే మార్గాల కోసం చూడండి. రోజ్మేరీని వేడి నీటిలో వేసి, చల్లబర్చి వాడితే కూడా వెల్లుల్లి వలె క్రిమినాశక మందుగా పనిచేస్తుంది, అయినప్పటికీ మీరు దానిని ఇష్టపడకపోవచ్చు.

మొటిమల చికిత్స కోసం మీ మూలికా నివారణలలో భాగంగా ఫేస్ ప్యాక్ ను ఉపయోగించాలనుకుంటే, మీ ముఖం మీద కొంచెం తేనెను రాసి, మీకు నచ్చినంతసేపు అలాగే వుంచి, వేడి నీళ్ళతో కాకుండా గోరువెచ్చని నీళ్ళతో కడగండి.

Ücretsiz ön izlemeyi tamamladınız.

Yaş sınırı:
0+
Litres'teki yayın tarihi:
11 temmuz 2024
Hacim:
31 s.
ISBN:
9788835423461
Telif hakkı:
Tektime S.r.l.s.
İndirme biçimi:
Metin
Ortalama puan 0, 0 oylamaya göre
Metin
Ortalama puan 0, 0 oylamaya göre
Metin
Ortalama puan 0, 0 oylamaya göre
Metin
Ortalama puan 0, 0 oylamaya göre
Metin
Ortalama puan 0, 0 oylamaya göre
Metin
Ortalama puan 0, 0 oylamaya göre
Metin
Ortalama puan 0, 0 oylamaya göre
Metin
Ortalama puan 0, 0 oylamaya göre
Metin
Ortalama puan 0, 0 oylamaya göre
Metin
Ortalama puan 0, 0 oylamaya göre